Tuesday, 26 November 2013

నేను మా బాబు కోసం వ్రాసిన మోదటి లాలి పాట.

నేను మా బాబు కోసం వ్రాసిన మోదటి లాలి పాట.

చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా,
నీలీలలు చాలయ్యా,పాలు త్రాగ రావయ్యా.

చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా.

కొప్పు మీద నెమలి కన్ను లేదు గాని చిన్ని నాన్నకు,
కొప్పు మీద నెమలి కన్ను లేదు గాని చిన్ని నాన్నకు,
పురి విప్పిన మనసంది, మనసులోన దైవముంది.

చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా,
చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా.

అరచేతిలొ వెదురు వేణువు లేదుగాని బుజ్జి నాన్నకు,
అరచేతిలొ వెదురు వేణువు లేదుగాని బుజ్జి నాన్నకు,
ప్రతి పలుకూ చిలక పలుకులే, ప్రతి మాటా తేనె ఝల్లులే.

చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా,
చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా.

బంగారు మొలతాడు లేదుగాని చిట్టి నాన్నకు,
బంగారు మొలతాడు లేదుగాని చిట్టి నాన్నకు,
వళ్శంతా పసిడి వెన్నెలే, చంద్రబింబమంటి మోములే.

చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా,
నీలీలలు చాలయ్యా,పాలు త్రాగ రావయ్యా.

చిన్ని చిన్ని కృష్ట్నయ్యా, నువ్వే మా కన్నయ్యా.

7 comments:

  1. hi shilpa .. very nice lullaby .. try to post audio file too to know the tune..

    ReplyDelete
    Replies
    1. Hi , So sweet of you... Will certainly try :)

      Delete
  2. Hey,,,excellent lyrics akka.... I wanna know it's tune... Chala adbhutam gaa undi :):)

    ReplyDelete
  3. HI Himabindu, i am not a good singer ,but will definitely try uploading .Thanks a million for support :)

    ReplyDelete